యేసు రాజ నాలో నిన్ను
yeesu raaja naaloo ninnu
🎵 TG-1662🌐 Telugu
పల్లవి
యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ||
1వ చరణం
తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
2వ చరణం
పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో నీ మాట చాలని – నీ బాట మేలని నా పాట నీవని – నీ సాటి లేరని