యేసు రక్షకా శతకోటి స్తోత్రం

yeesu rakssakaa shathakooti sthoothram

🎵 TG-2613🌐 Telugu
పల్లవి

యేసు రక్షకా శతకోటి స్తోత్రం జీవన దాత కోటి కోటి స్తోత్రం యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) నా సమస్తము అర్పించి ఆరాధించెదను యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2)        ||యేసు రక్షకా||

1వ చరణం

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు ఎన్నటికిని ఎడబాయనన్నాడు తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు నా సమస్తము అర్పించి – ఆరాధించెదను నా సర్వము అర్పించి – ఆరాధించెదను శరణం శరణం యేసు స్వామి శరణం (3)        ||యేసు ఆరాధించెదను||

Report Error