యేసు స్వామీ నీకు నేను
yeesu svaamee neeku neenu
🎵 TG-2457🌐 Telugu
పల్లవి
యేసు స్వామీ నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధి-లో వసించి ఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తము నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోక యాశల్ యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము||
1వ చరణం
నేను నీ వాడను యేసు నీవును నా వాడవు నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము యేసు నీదే నా సర్వాస్తి హా సుజ్వాలన్ పొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము