యేసు యేసూ.. యేసూ.. యేసు
yeesu yeesuu.. yeesuu.. yeesu
🎵 TG-2808🌐 Telugu
పల్లవి
యేసు యేసూ.. యేసూ.. యేసు నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు ||యేసు యేసూ||
1వ చరణం
నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2) నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు