యేసుని నా మదిలో స్వీకరించాను

yeesuni naa madiloo sveekarinchaanu

🎵 TG-1993🌐 Telugu
పల్లవి

యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని||

1వ చరణం

పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం ||హల్లెలూయ||

2వ చరణం

నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము

Report Error