యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
yeesunu stutiyinchu vaaru nityajiivamu nondedaru
పల్లవి
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు
1వ చరణం
వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా " యేసు "
2వ చరణం
చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా "యేసు "
3వ చరణం
నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ "యేసు "