యేసుతో ఠీవిగాను పోదమా (2) - అడ్డుగా వచ్చు వైరి గెల్వను
yeesuthoo ttheevigaanu poodamaa (2) - addugaa vachchu vairi gelvanu
🎵 TG-1196🌐 Telugu
పల్లవి
యేసుతో ఠీవిగాను పోదమా (2) - అడ్డుగా వచ్చు వైరి గెల్వను (2) యుద్ధ నాదంబుతో పోదమా
1వ చరణం
రారాజు సైన్యమందు చేరను - ఆరాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
2వ చరణం
విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో ఠీవిగాను పోదము ||యేసుతో||
3వ చరణం
శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్నో తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము సాదనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
4వ చరణం
ఓయువతి యువకులార చేరుడీ - శ్రీ యేసు రాజు వార్త చాటుడీ లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను సాదనంబెవరు నీవు నేనెగా ||యేసుతో ఠీవిగాను||