యేసుతో ఠీవిగాను పోదమా-2 - అడ్డుగా వచ్చు వైరి గెల్వను

yeesutoo tthiivigaanu poodamaa-2 - addddugaa vachchu vairi gelvanu

🎵 TG-1195💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యుద్ధ నాదంబుతో పోదమా

1వ చరణం

రారాజు సైన్యమందు చేరను - ఆరాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను "యేసుతో"

2వ చరణం

విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో ఠీవిగాను పోదము "యేసుతో"

3వ చరణం

శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్నో తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము సాదనంబెవరు నీవు నేనెగా "యేసుతో"

4వ చరణం

ఓయువతి యువకులార చేరుడీ - శ్రీ యేసు రాజు వార్త చాటుడీ లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను సాదనంబెవరు నీవు నేనెగా

Report Error