యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
yeesuu niivee kaavaalayyaa - naatoo kuuddaa raavaalayyaa
పల్లవి
ఘనుడా ని దివ్య సన్నిధి - నను ఆదుకొనే నా పెన్నిధి (2) అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా..
1వ చరణం
నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు
2వ చరణం
నీవే నాతో వస్తే - కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదు
3వ చరణం
నీవే నాతో వస్తే - ఓటమి నా కుండదు నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదు