యెహోవ నా మొర లాలించెను

yehoova naa mora laalinchenu

🎵 TG-2258🌐 Telugu
పల్లవి

యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||

1వ చరణం

పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను మదావలము బోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను

Report Error