యెహోవా నాబలమా - యదార్ధమైనది నీ మార్గం
yehoovaa naabalamaa - yadaardhamainadi nii maargan
పరి పూర్ణమైనది నీ మార్గం - యెహోవా....ఆ..ఆ
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను ఎడబాయని దేవా "యెహోవా"
మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను - అదరెను ధరణి భయకంపముచే "యెహోవా"
నాదిపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును జలరాశుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు "యెహోవా"
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతములపునాదులు వణికెను తన నోటనుండి వచ్చిన అగ్ని - దహించి వేసెను వైరులనెల్ల "యెహోవా"
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని "యెహోవా"
దయగల వారిపై దయచూపించను - కటినుల యెడల వికటముజూపును గర్విష్టులయెక్క గర్వముననచును - సర్వము నెరిగిన సర్వాదికారి "యెహోవా"
నా కాళ్లను లేడికాల్లగజేసి - ఎత్తైన స్థలములలో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము జేర్చిన "యెహోవా"
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడవు నీవే అన్యజనులలో ధన్యత చూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద "యెహోవా"