యెహోవా నీ నామము ఎంతో
yehoovaa nee naamamu enthoo
🎵 TG-2671🌐 Telugu
పల్లవి
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
1వ చరణం
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే ||యెహోవ||