యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే

yuddhamu yehoovaadee - yuddhamu yehoovaadee - yuddhamu yehoovaadee

🎵 TG-1309💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే యేసు కొరకు నిలచున్నవాడా యేసు కొరకు జీవించువాడా జయించుము అనుక్షణము జయించుము దినదినము

1వ చరణం

రెండంచుల ఖడ్గమును పట్టుకొని ప్రార్ధించుము నీ పట్టు వదలక సిలువ పైన గురిని నిల్పుము చేరువరకు నీ గమ్యస్థానము ||యుద్ధము||

2వ చరణం

పరలోకము నీ పక్షముండగా ప్రభు యేసే నీ ప్రక్కనుండగా పోరాడి నిను గెల్చునెవ్వరు ప్రభువుకన్న బలవంతుడెవ్వరు ||యుద్ధము||

3వ చరణం

భక్తులెందరో నీకు ముందుగ శక్తిని పొంది సాగుచుండగా ప్రభువు వారిని నడుపుచుండగా ప్రియుడా నిన్ను నడపకుండునా ||యుద్ధము||

4వ చరణం

మోషే ఏలియా మొదలగువారు పౌలు పేతురు పరమ భక్తులు ఎందరెందరో ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ ||యుద్ధము||

5వ చరణం

యెహెజ్కేలు యెషయా దానియేలు దావీదు మలాకీ ఎందరెందరో ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ ||యుద్ధము||

Report Error