TG-3827
Telugu

నన్నెంతగానో ప్రేమించెన

Nannenthagaano Preminchenu

1
views
పల్లవి

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||

1వ చరణం

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక (2) తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||

2వ చరణం

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) నేర్పించెను నాకు చూపించెను (2) వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||

3వ చరణం

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) నా కోసమే యేసు శ్రమ పొందెను (2) నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత||

4వ చరణం

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) ఏమిత్తును నేనేమిత్తును (2) నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||