TG-4368
Telugu

ఉపవాసంతో ప్రార్ధనలో

Upavaasamtho Praardhanalo

19
views
పల్లవి

ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా మోకాళ్లపై కన్నీటితో నే చేయు ప్రార్ధన వినుము దేవా అడిగిననూ ఇయ్యవా దేవా వెదకిననూ దొరకవా దేవా తట్టిననూ తీయవా దేవా యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో||

1వ చరణం

నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2) దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2) రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ||

2వ చరణం

జీవించు కాలమంతా నీ సేవ చేయాలి నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2) నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2) రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.