TG-5094
Telugu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము

Nannu Diddumu Chinna Praayamu

0
views
పల్లవి

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||

1వ చరణం

దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||

2వ చరణం

మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||

3వ చరణం

చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||

4వ చరణం

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||

5వ చరణం

కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను||

6వ చరణం

ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||

7వ చరణం

శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను||

8వ చరణం

వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||