♪♫
TG-3900
Telugu
నీ రక్త ధారలే ఇల
Nee Rakthame Nee Rakthame
0
views
పల్లవి
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ నీ రక్తమే నా బలము (2) నీ రక్త ధారలే ఇల పాపికాశ్రయంబిచ్చును (2) పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||
1వ చరణం
నశించు వారికి నీ సిలువ వెర్రితనముగ నున్నది (2) రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||
2వ చరణం
నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే (2) పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||
3వ చరణం
పంది వలె పొర్లిన నన్ను కుక్క వలె తిరిగిన నన్ను (2) ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే||
4వ చరణం
నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ (2) దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||
5వ చరణం
స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును (2) స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||