TG-5466
Telugu

పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా

Parishuddhaathma Nithyaathma Parama Paavuramaa

0
views
పల్లవి

పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

1వ చరణం

1.  నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

2వ చరణం

2.  జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

3వ చరణం

3.  పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||

4వ చరణం

4.  భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

5వ చరణం

5.  తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||