♪♫
TG-3206
Telugu
చేయి పట్టుకో నా
Cheyi Pattuko Naa
0
views
పల్లవి
చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||
1వ చరణం
కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము ||చేయి||
2వ చరణం
శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము ||చేయి||