ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును
prabhukreesthu yeesu preeminche sanghamunu
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభుక్రీస్తు యేసు||
దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభుక్రీస్తు యేసు||
యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభుక్రీస్తు యేసు||
బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభుక్రీస్తు యేసు||
దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభుక్రీస్తు యేసు||
పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభుక్రీస్తు యేసు||
క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభుక్రీస్తు యేసు||