లెక్కింపగ తరమా నీ మేలులు

lekkinpaga tharamaa nee meelulu

🎵 TG-2617🌐 Telugu
పల్లవి

లెక్కింపగ తరమా నీ మేలులు వివరింపగ తరమా నీ కార్యములు (2) నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2)        ||లెక్కింపగ||

1వ చరణం

నీ ప్రేమలోనే తను ఎదగాలి నీ రక్షణలోనే కొనసాగాలి నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని నిరతం నిన్నే స్తుతియించాలి తన జీవితమంతా నీ రెక్కల క్రింద నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2)     ||లెక్కింపగ||

2వ చరణం

నీ వాక్యము తన హృదిలో ఉండాలి నీ తలంపులు మదిలో నిండాలి నీ దయయందు మనుష్యుల దయయందు ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2)       ||లెక్కింపగ||

Report Error