♪♫
TG-4946
Telugu
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
Chinni Manasuthoo Ninnu Aaraadhinthunu
0
views
పల్లవి
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము నీవే నా ప్రాణము నీవే నాధ్యానము నీవే నాధ్యానము – నీవే నాధ్యానము తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె (విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము) (2) వినయముగల మనసివ్వుము - వినయముగల మనసివ్వుము ||చిన్ని||
1వ చరణం
తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు (2) నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు ||చిన్ని||
2వ చరణం
తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను నీ సాక్షిగా బ్రతికెదను ||చిన్ని||