TG-407
Telugu

ప్రీతిగల మన యేసుఁ డెంతో

preethigala mana yeesum denthoo

201
views
పల్లవి

ప్రీతిగల మన యేసుఁ డెంతో గొప్ప మిత్రుఁడు మితిలేని దయచేత హత్తుచుఁ బ్రేమించును క్రీస్తునొద్ద మన భార మంత నప్పగించినన్ శక్తిగల యేసుచేత మోఁత లెల్ల వీడును

1వ చరణం

నీతిగల మన యేసు ధృతిగల మిత్రుఁడు మృతిఁ బొంది కృపతో వి శ్రాంతి కలిగించెను భీతి నొందుఁ బాపు లైనఁ జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతిఁ జూతురు ||ప్రీతిగల మన||

2వ చరణం

దయగల మన యేసు ప్రియమైన మిత్రుఁడు మాయలోకమందు నిజా శ్రయుఁడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధిచేయును. ||ప్రీతిగల మన||

3వ చరణం

ధారుణిలో యేసుగాక వేరుగొప్ప మిత్రుఁడా? పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుఁడు నారకుల! గావ వేగఁ గ్రూర హింసఁ బొందెను కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థన నాలించును. ||ప్రీతిగల మన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.