TG-4064
Telugu

పావురమా సంఘముపై

Paavuramaa Sanghamupai

0
views
పల్లవి

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) హల్లెలూయా – హల్లేలూయా (2) తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2) కడవరి చినుకులు పడగా పొలములో (2) ఫలియించెను దీవెనలే ||పావురమా||

1వ చరణం

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2) సభకే జయమౌ ఉబికే జీవం (2) ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా||

2వ చరణం

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2) వెలిగే వరమా ఓ పావురమా (2) దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||