TG-3289
Telugu

దేవునికి స్తోత్రము గానము

Devuniki Sthothramu Gaanamu

0
views
పల్లవి

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||

1వ చరణం

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||

2వ చరణం

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||

3వ చరణం

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||

4వ చరణం

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||

5వ చరణం

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||

6వ చరణం

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||

7వ చరణం

గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||

8వ చరణం

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||

9వ చరణం

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||

10వ చరణం

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||

11వ చరణం

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||