♪♫
TG-3613
Telugu
లాలి లాలి జోలాలి
Laali Laali Jolaali
0
views
పల్లవి
లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2) లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2) మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||
1వ చరణం
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2) మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2) మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||
2వ చరణం
దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని (2) సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి (2) మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||