TG-362
Telugu

క్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁడీ

kreesthu yoodhulaaraa yuddha maadumdee

205
views
పల్లవి

క్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు సిల్వ మీరు పట్టి గెల్వుఁడీ మన రాజు క్రీస్తు దండు నడ్పును చూడు మాకు ముందు క్రీస్తు ధ్వజము. ||క్రీస్తు యోధులారా||

1వ చరణం

లోక రాజ్య కీర్తి వాడిపోవును క్రీస్తు రాజ్యమైన నిత్య ముండును సాతా నాధిపత్య మాఁగిపోవును క్రీస్తు దివ్య సభ జయ మొందును. ||క్రీస్తు యోధులారా||

2వ చరణం

ఓ జనంబులారా వచ్చి చేరుఁడీ జయ కీర్తనంబు లెత్తి పాడుఁడీ కీర్తి, స్తుతి, ఘవ మెన్నఁ డుండును మన క్రీస్తు రాజు నిత్య మేలును. ||క్రీస్తు యోధులారా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.