TG-4750
Telugu

ఎటుల నీకు స్తుతు లొనర్తుము

Etula Neeku Sthuthu Lonarthumu

0
views
పల్లవి

ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||ఎటుల||

1వ చరణం

1. పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||ఎటుల||

2వ చరణం

2.  భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||ఎటుల||

3వ చరణం

3.  నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపఁజేసితి ||ఎటుల||

4వ చరణం

4.  నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||ఎటుల||

5వ చరణం

5.  పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||ఎటుల||