TG-4633
Telugu

ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు

Ishraayeelunu Kaapaadu Deevudu Kunukadu Nidrapoodennadu

16
views
పల్లవి

ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 1.  ఇత్తడి తలుపులను ఇనుప గడియలను - మా దేవుడే పగులగొట్టును మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేం స్వతంత్రించను (2) రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము (2) మాకు సొత్తుగా స్వాస్థ్య ధనముగా - ఇచ్చెను ప్రభువు ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 2.  జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా (2) ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా (2) చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 3.  పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గు-డారమును చేరనీయడు (2) మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గమంతటిలో తోడుండగా తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 4.  మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును (2) మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము (2) ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 5.  సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను - యేసుని పేరిట బలపరచెదం తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని - ధైర్యముగుండమని దృడపరిచెదం (2) సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం (2) అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) 6.  నరులను పట్టేటి జాలరులుగా మేం - దైవ రాజ్యపు వలలు విసురుతాం యేసు రక్తమే పాపము కడుగునని - సర్వ లోకానికి చాటి చెప్పుతాం (2) రారాజుకు రాయబారులం మేము - క్రీస్తేసుతో జత పనివారము (2) యేసు నందలి ఆ నందమే - మాకు బలము ఇది సత్యం ఆమెన్ భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2) భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.