♪♫
TG-4890
Telugu
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
Goppa Deevudavani Shakthi Sanpannudani
0
views
పల్లవి
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||
1వ చరణం
అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||
2వ చరణం
సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని (2) సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||