TG-4293
Telugu

స్తోత్రము స్తుతి చెల్లింతుమ

Sthothramu Sthuthi Chellinthumu

0
views
పల్లవి

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము||

1వ చరణం

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ నీ తోడు నాకుండ భయము లేదుగా శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా బలమైన కోట నీవేగా (2) నా దుర్గమా నా శైలమా నా అతిశయమా ఆనందమా (2) ||నీవే||

2వ చరణం

హింసలైననూ పలు నిందలైననూ నీ చల్లని రెక్కలే నాకాశ్రయం చీకటైననూ అగాధమైననూ నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2) నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా మంచి కాపరి (2) ||నీవే||