సృష్టికర్తవైన యెహోవా
Srushtikarthavaina Yehovaa
సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.