TG-4819
Telugu

కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము

Koopa Dinamu Vachchunu Paapula Gunde Pagulu Kaalamu

0
views
పల్లవి

కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప||

1వ చరణం

1.  భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి నెంతో ||కోప||

2వ చరణం

2.  నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ నరకములోఁ బడునట్టి ||కోప||

3వ చరణం

3.  ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో బడి కాలే ||కోప||

4వ చరణం

4.  కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల పాలయ్యెడు ||కోప||

5వ చరణం

5.  మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||