♪♫
TG-3480
Telugu
ఇరువది నలుగురు పెద్దలతో
Iruvadi Naluguru Peddalatho
14
views
పల్లవి
ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో (2) నాలుగు జీవుల గానముతో (2) స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
1వ చరణం
భూమ్యాకాశములన్నియును పర్వత సముద్ర జల చరముల్ (2) ఆకాశ పక్షులు అనుదినము (2) గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||
2వ చరణం
కరుణారసమగు హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు (2) మనుజుల రక్షణ కారకుడా (2) మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||
3వ చరణం
గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు (2) గొర్రెల కాపరి దావీదు (2) అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.