♪♫
TG-5587
Telugu
మారిన మనసులు మధురం మీకు
Maarina Manasulu Madhuran Meeku
0
views
పల్లవి
మారిన మనసులు మధురం మీకు అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2) ఇహ లోక కానుకలు అల్పములు మీకు పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన||
1వ చరణం
నా హృదయ కుసుమమును అప్పము చేసి నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||
2వ చరణం
నా జయము అపజయము నీవే దేవా నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||