TG-4017
Telugu

నూతన పరచుము

Noothana Parachumu

0
views
పల్లవి

నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన||

1వ చరణం

శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి||

2వ చరణం

ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||