TG-4015
Telugu

నిత్యము స్తుతించినా

Nithyamu Sthuthinchinaa

0
views
పల్లవి

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||

1వ చరణం

అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||

2వ చరణం

జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||

3వ చరణం

మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||