♪♫
TG-5570
Telugu
మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు
Maatlaadee Yeesayyaa Naathoo Maatlaaduchunnaadu
0
views
పల్లవి
మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (2) (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే||
1వ చరణం
వెన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని (3) వేకువనే తట్టుచున్నాడు కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే||
2వ చరణం
అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో ఘనపరచెదను (2) ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే||
3వ చరణం
లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరిపించాడు మహనీయుడు (3) ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2) తన మాటతో నన్ను బలపరచాడు కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||