దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ

deevaathma jayoo deenadayaalluu paavanaathma

🎵 TG-093💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో ||దేవాత్మ జయో||

1వ చరణం

సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో ||దేవాత్మ జయో||

2వ చరణం

పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో ||దేవాత్మ జయో||

3వ చరణం

దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో ||దేవాత్మ జయో||

4వ చరణం

పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో ||దేవాత్మ జయో||

Report Error