దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం -సౌభాగ్యం దైవ జనుల హృదయానందం. ||దేవుని నీతి||
ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత. ||దేవుని నీతి||
పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం. [మానం ||దేవుని నీతి||
జనముల జీవాధిపతి జగమంతటి నేలెడిజ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలెడి నీతి జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల. ||దేవుని నీతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.