TG-3874
Telugu

యేసయ్యా నీ కృప నాకు

Nee Krupa Leni Kshanamu

0
views
పల్లవి

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||

1వ చరణం

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

2వ చరణం

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||