TG-4276
Telugu

సిలువలో నీ ప్రేమ

Siluvalo Nee Prema

0
views
పల్లవి

సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో||

1వ చరణం

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2) నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని||

2వ చరణం

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2) నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి మరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని||

3వ చరణం

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2) నిను చాటించుటకు – వెలుగై సాగెదను ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని||