TG-4432
Telugu

యెహోవా నా కాపరి

Yehovaa Naa Kaapari

0
views
పల్లవి

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ ||యెహోవా||

1వ చరణం

మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ ||యెహోవా||

2వ చరణం

పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను ||యెహోవా||

3వ చరణం

నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది ||యెహోవా||

4వ చరణం

చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను ||యెహోవా||