TG-603
Telugu

క్రొత్త యేడు మొదలు బెట్టెను

kroththa yeedu modalu bettenu

198
views
పల్లవి

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త యేడు||

1వ చరణం

పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త యేడు||

2వ చరణం

మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త యేడు||

3వ చరణం

బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త యేడు||

4వ చరణం

ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త యేడు||

5వ చరణం

పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త యేడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.