TG-4969
Telugu

చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో

Choodaree Maareendu Putti Naandu Bethleheemuloo

0
views
పల్లవి

చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి వాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే||

1వ చరణం

1.  ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి కన్ననది మించెను ||చూడరే||

2వ చరణం

2.  దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||

3వ చరణం

3.  తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ వరుసగాను జేసిరి ||చూడరే||

4వ చరణం

4.  మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు శాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే||