♪♫
TG-3248
Telugu
దేవ దాసపాలక
Deva Daasapaalaka
0
views
పల్లవి
దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా దేవా దేవా దీన పోషకా ||దేవ||
1వ చరణం
లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ||
2వ చరణం
దిక్కులేని పాపి కొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందగా ||దేవ||
3వ చరణం
కఠినులంత కుటిలము జేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ||
4వ చరణం
ఇంత యొర్పు యింత శాంతమా నాకై పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా పాపి నీదగు దాపు జేర్చవే ||దేవ||
5వ చరణం
కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||దేవ||