దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు

dorakuthaavuraa sahoodaraa! dorukuthaavuraa, neevu

🎵 TG-660💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొరకుతావురా సహోదరా!||

1వ చరణం

చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొరకుతావురా సహోదరా!||

2వ చరణం

వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొరకుతావురా సహోదరా!||

3వ చరణం

భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొరకుతావురా సహోదరా!||

4వ చరణం

విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొరకుతావురా సహోదరా!||

5వ చరణం

క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొరకుతావురా సహోదరా!||

6వ చరణం

కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొరకుతావురా సహోదరా!||

7వ చరణం

మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొరకుతావురా సహోదరా!||

8వ చరణం

దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొరకుతావురా సహోదరా!||

9వ చరణం

కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె ||దొరకుతావురా సహోదరా!||

10వ చరణం

చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి ||దొరకుతావురా సహోదరా!||

Report Error