దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని

deevuni sthuthiyinchudi ellappudu deevuni

🎵 TG-659💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని స్తుతియించుడి||

1వ చరణం

ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దేవుని స్తుతియించుడి||

2వ చరణం

ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దేవుని స్తుతియించుడి||

3వ చరణం

ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దేవుని స్తుతియించుడి||

4వ చరణం

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దేవుని స్తుతియించుడి||

5వ చరణం

సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దేవుని స్తుతియించుడి||

6వ చరణం

తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దేవుని స్తుతియించుడి||

7వ చరణం

పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దేవుని స్తుతియించుడి||

8వ చరణం

మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ ||దేవుని స్తుతియించుడి||

9వ చరణం

సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దేవుని స్తుతియించుడి||

Report Error