జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము

jeevithamantha nee preemagaanam prannuthinthumu

🎵 TG-654💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో ||జీవితమంత నీ||

1వ చరణం

సర్వసమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు నీ నామధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత నీ||

2వ చరణం

సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత నీ||

3వ చరణం

కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత నీ||

4వ చరణం

పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీరాజ్యంబులో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత నీ||

Report Error