TG-3249
Telugu

దేవ సంస్తుతి చేయవే

Deva Samsthuthi Cheyave

0
views
పల్లవి

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ||

1వ చరణం

జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||

2వ చరణం

చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||

3వ చరణం

యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||

4వ చరణం

ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||

5వ చరణం

అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||

6వ చరణం

పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ||

7వ చరణం

పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ||

8వ చరణం

కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ||

9వ చరణం

మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ||

10వ చరణం

పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ||

11వ చరణం

పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||